calender_icon.png 24 October, 2024 | 5:02 AM

ఢిల్లీలో కాలుష్య మబ్బులు

24-10-2024 02:42:33 AM

ఢిల్లీలో పరిస్థితిపై సుప్రీం కోర్టు సీరియస్

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రతి ఏడాదిలాగే ఈసారి దేశ రాజధాని ఢిల్లీ గాలి నాణ్యత దిగజారిపోయింది. దీపావళికి ముందే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో అత్యంత తక్కువ విలువలు నమోదయ్యాయి. బుధవారం ఉద యం 7 గంటల సమయానికి ఏక్యూఐలో ఢిల్లీ గాలి నాణ్యత 354గా నమోదయింది. ఫలితంగా నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మే సింది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ ను అమలు చేస్తున్నారు. రోడ్లపై వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని చల్లుతున్నారు. 

కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న క్రమంలో కేంద్రంపై సుప్రీం కోర్టు బుధవారం సీరియస్ అయింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యవర్థాలను తగలబెడుతుండటంతో సమస్య జఠిలం అవుతుందని అభిప్రాయపడింది. పర్యావరణ పరిరక్షణ చట్టాలకు సవరణలు చేయడం వల్లే పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని నివారించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.