న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత మరోసారి పడిపోయింది. మంగళవారం ఉదయం గాలి నాణ్యత 400 పాయింట్లకు పడిపోయింది. దీంతో గ్రాప్ 4 ఆంక్షలు అమల్లోకి తెస్టున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరిగి, ఈ సీజన్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లోధి రోడ్ లో ఉష్ణోగ్రతలు 5 డీగ్రీల కనిష్ఠస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణాలు సాగిస్తున్నారు.