హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఈనెల 19న టీజీ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) మొదటి విడత సీట్లను అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఈనెల 17వ తేదీతో వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ముగియడంతో రేపు అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ముందస్తుగా అనుమతులిచ్చిన దానిప్రకారం కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లుండగా, ఈనెల 16వ తేదీన మరికొన్ని సీట్లకు అనుమతులివ్వడంతో ఇప్పుడు సీట్ల సంఖ్య 72,741కి పెరిగింది. ముందు కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా కలిపి మొత్తం 98,296 సీట్లు ఉండగా, కొత్తగా 3,365 సీట్లు పెరగడంతో ఇప్పుడు వాటి సంఖ్య 1,01,661కి పెరిగింది. దీంతోపాటు ఆల్ ఇండి యా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇటీవల ఆయా కాలేజీలకు 20 వేల సీట్లకు అనుమతిచ్చింది. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతలు ఇవ్వాలని ఆయా కాలేజీల యాజమా న్యాలు కోరాయి. 2,640 సీట్లకు మాత్రమే సర్కారు అనుమతులిచ్చింది.