హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): నేడు ఎప్‌సెట్ (ఇంజినీ రింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు సీట్లు కేటాయించనున్నారు. శుక్రవారం సాయంత్రం తర్వాత సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.