calender_icon.png 10 January, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఆమోదం

05-01-2025 02:07:36 AM

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను కలుపు తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. కొత్తగూడెం టౌన్ (36 వార్డులు), పాల్వంచ టౌన్ (24 వార్డులు), సుజాతనగర్ (7 పంచాయతీలు)ను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ఏడాదిపాటు పట్టుబట్టి కార్పొరేషన్‌ను సాధించారు. కార్పొరేషన్ ఏర్పా టుతో పాతికేళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది