హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (వి జయక్రాంతి): మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మొత్తం 13 అంశాలను ఆమోదించారు. కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల వద్ద ఫ్లుఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలను ప్రభుత్వ ఆమోదానికి సిఫార్సు చేస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మాణాన్ని ఆమోదించింది. సమావేశంలో కమిషనర్ ఇలంబర్తి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.