calender_icon.png 23 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండాలకు సముచిత స్థానం కల్పించాలి

23-01-2025 12:00:21 AM

 మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జనవరి 22 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపం వద్ద గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన నిరాహార దీక్షకు మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ హాజరైసంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన డిమాండ్ల వెంటనే పరిష్కరించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి, సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజు జయంతి రోజును సెలవు దినంగా పరిగణించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేసి బాల బాలికల కళాశాల వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

తండాలను ప్రత్యేక రెవిన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించి ఒక్కొక్క గ్రామపంచాయతీ అభివృద్ధికి రూ 5 కోట్లు కేటాయించాలని,  న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, ప్రతాప్ నాయక్, సంజీవ్ నాయక్, లక్ష్మణ్ నాయక్, కిషన్ పవర్, రెహమాన్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.