calender_icon.png 4 October, 2024 | 10:44 PM

యువ గ్రాడ్యుయేట్లకు బ్యాంక్‌ల్లో అప్రెంటీస్‌షిప్

07-09-2024 12:00:00 AM

  1. నెలరోజుల్లో తీసుకుంటాం 
  2. ఐబీఏ చీఫ్ సునీల్ మెహతా

ముంబై, సెప్టెంబర్ 6: యువ గ్రాడ్యుయేట్లను అప్రెంటీస్‌లుగా తీసుకోవాలని బ్యాంక్‌లు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా వెల్లడించారు. వారికి బ్యాం క్‌లు నెలకు రూ.5,000 స్టుఫైండ్ చెల్లిస్తాయని, అప్రెంటీస్‌షిప్ సమయంలో ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తాయని తెలిపారు. నెలరోజుల్లో నియామకాలు ప్రారంభమవుతా యన్నారు. వచ్చే ఐదేండ్లలో కోటి మంది యువకులకు టాప్ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించిన నేపథ్యంలో బ్యాంక్‌లు ముందుకు వస్తున్నాయని మెహతా వివరించారు.

మార్కెటింగ్, రికవరీలు వంటి పలు విభాగాల్లో యువతకు తాము శిక్షణ ఇస్తామని, వారు ఆ నైపుణ్యంతో సొంతంగా ఉపాధిని పొందుతారని చెప్పారు.  21 ఏండ్ల వయస్సు కలిగినవారు, పన్ను చెల్లింపుదార్లు కానివారు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో డిగ్రీ పొందనివారు బ్యాంక్‌ల్లో అప్రెంటీస్‌గా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అటువంటి అప్రెం టీస్‌లను 12 నెలల కాలానికి నియమించుకుంటామని, బిజినెస్ కరస్పాండెంట్‌లుగా పనిచేస్తు న్నవారిని సైతం తీసుకుంటామని తెలిపారు.

బ్యాంక్‌లు అప్రెంటీస్‌లుగా చేర్చు కున్నవారిలో కొంతమందిని ఉద్యోగులుగా నియమించుకునే అవకాశం కూడా ఉన్నదన్నారు. ఈ స్కీము అమలుకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శితో ఐబీఏ గురువారం సమావేశమయ్యిందని, నెలరోజుల్లోగా దీనిని అమలు చేస్తామని చెప్పారు. ఇంటెర్న్స్‌గా ఎంతమందిని తీసుకునేదీ మెహతా వెల్లడించలేదు. అన్ని బ్యాంక్‌లూ ఈ స్కీమ్‌ను అమలు చేస్తాయన్నారు. స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుందని తెలిపారు.