calender_icon.png 16 January, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటిఐ పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ మేళా

16-01-2025 04:33:46 PM

ఆర్ ఐటిఐ ప్రిన్సిపాల్ ధర్మాచారి... 

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐ.టి.ఐ పాసైన అభ్యర్థులకు జిల్లా పరిధిలోని వివిధ పరిశ్రమలలో అప్రెంటిస్ మేళా, ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళ (PMNAM) ప్రభుత్వ ఆర్. ఐ. టి. ఐ భద్రాచలం, కృష్ణ సాగర్ నందు నిర్వహించుటకు నిర్ణయించినట్లు ఆర్. ఐ.టి.ఐ కృష్ణ సాగర్ ప్రిన్సిపాల్ ధర్మచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు అందరూ ముందుగా www.apprenticeshipindia.org.in నందు వారి పేరు నమోదు చేసుకొని నకలు కాపిని ఒక బయోడేటా ఫామ్ ను, సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిస్ మేళాకు హాజరు కావాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ/ప్రైవేట్ ప్రధానాచార్యులు, పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిధిలోని అప్రెంటిస్ ఖాళీల వివరాలతో ఈనెల 20 ఉదయం పది గంటలకు ప్రభుత్వ ఆర్. ఐ. టి. ఐ భద్రాచలం కృష్ణ సాగర్ నందు హాజరుకావాలని అన్నారు. ఐ.టి.ఐ పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.