భద్రాచలం (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పరిధిలో వివిధ శాఖలలో పనిచేయుచున్న అధికారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సిబ్బందికి విశిష్ట సేవలు అందించినందుకు గాను మొట్టమొదటిసారిగా కోయ భాషలో తెలుగు లిపి ద్వారా ప్రశంసాపత్రాలు ముద్రించి అందించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. ఆదివారం ఐటిడిఏ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గిరిజనులకు విశిష్ట సేవలు అందించిన అధికారులకు ఇతర ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అంతరించి పోకుండా అలాగే భాషా సంస్కృతిని నేటి యువత అవగాహన కల్పించుకునే ఉద్దేశంతో కోయ భాషను ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు మరింత దగ్గరగా గిరిజనుల చెంత పనిచేస్తున్నట్లు అర్థం చేసుకోవడం కోసం కోయ భాషలో ముద్రించడం జరిగిందన్నారు.