15-03-2025 12:00:00 AM
మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి
బొడ్డు దయాకర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు
హనుమకొండ, మార్చి 14 (విజయక్రాంతి): ఎస్సీల వర్గీకరణ అమలు చేశాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పిఎస్ మాజీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ అన్నారు. ఏకశిలా పార్కు వద్ద ఎమ్మార్పిఎస్, ఎంఎస్‌పి, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరు గుతున్న రిలే దీక్షలు 6 వ రోజుకు చేరింది. ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడ్డు దయాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీలలో మాదిగల జనాభా అధికంగా ఉంటుంది కనుక మాదిగల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో వాట కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.
ఎస్సిలలో ఏబీసీ గ్రూపులుగా కాకుండా ఎస్సీలని ఎబిసిడి గ్రూపులుగా విభజించి అన్ని కులాలకు న్యాయం చెయ్యాలని లేని పక్షంలో మాదిగ, మాదిగ ఉప కులాలను ఏకం చేసి మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధపడుతమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నడని రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకిగా మారడని రేవంత్ రెడ్డి మాలల పక్షపాతిగా ఉంటూ మాదిగలపై వివక్ష ధోరణితో వ్యవహరిస్తే మాదిగ సమాజం చూస్తూ ఊరుకోదని మాదిగ జాతికి కృతజ్ఞత భావం ఎంత ఉంటుందో మోసం చేసే వాళ్ళ పైన తిరుగుబాటు చేసినప్పుడు పోరాటాలు చేసినప్పుడు అంతే ధీటుగా చేస్తుందని చెప్పారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోని మాదిగలకు రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారం కల్పించి సంపూర్ణమైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎంఎస్‌పి జాతీయ నేత మంద కుమార్ మాదిగ ,ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్ను దినేష్ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎంవైఎస్ జాతీయ నాయకులు చాతాళ్ళ శివ మాదిగ, ఎంఇఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంద చిన్న రాజు మాదిగ, ఎమ్మార్పిఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మంద వర్ధన్ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా కార్యదర్శి రాజరాపు కిరణ్ మాదిగ, ఎమ్మార్పిఎస్ హనుమకొండ ప్రధాన కార్యదర్శి సిలువేరు భిక్షపతి మాదిగ. ఎమ్మార్పిఎస్, ఎంఎస్‌పి నాయకులు ఎర్ర రాము మాదిగ ,సింగరాపు మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు.