18-03-2025 01:12:59 AM
వైరా, మార్చి 17 :- రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఆరవ రోజు రిలే నిరసన దీక్షలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట కోటి మాదిగ మండల ఇన్చార్జ్ కరిశ రమేష్ మాదిగ ఆధ్వర్యంలో వైరా రింగ్ రోడ్ సెంటర్ నందు బి ఆర్‌ఎస్ నాయకులు.
ఆదూరి ప్రేమ్ మాజీ వార్డు మెంబర్ మోదుగు లక్ష్మయ్య టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పమ్మి అర్జున్ రావు ఈ దీక్షలను ప్రారంభించారు.వైరా శాంతినగర్ ఎస్సీ కాలనీ 14 వార్డుకు చెందిన జై భీమ్ వారియర్స్ సభ్యులు పమ్మి దాసు కుక్కల నాగభూషణం చాట్ల దానియేలు, పింగళి చలపతి ,ఆర్‌ఎంపి పమ్మి సైదులు,దేవరపల్లి కాంతారావు నల్లగట్ల సాయి కాకాటి నరసింహారావు మోదు గు సుధాకర్ కరిశ వాసు తదితరులు పాల్గొన్నారు. టిడిపి సంఘీభావం.
ఈ దీక్షలకు సంఘీభావంగా టిడిపి మండల కమిటీ తరఫున ఆ పార్టీ మండల అధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు టిడిపి ప్రభుత్వం గతంలోని నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరిపి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ అధ్యక్షులు మన్నేపల్లి ప్రదీప్ రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వెంకటేష్ రావు సీనియర్ నాయకులు చలపతిరావు కాంతారావు మురళి పాల్గొన్నారు.