- కొలిజియంపై అపోహలను తొలగించాలి
- మాజీ సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ, నవంబర్ 24: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జిల నియామ కంలో కొలిజియం వ్యవస్థపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉం దని మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ‘సంవిధాన్@75 కాంక్లేవ్’ సదస్సు లో మాట్లాడుతూ.. జడ్జ్జిల నియామకాలు మరింత పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
న్యాయమూర్తుల నియామకం వివిధ దశల్లో జరుగుతుందని, ఏకపక్షంగా సుప్రీం నిర్ణయం తీసుకోదని తెలిపారు. ఒక న్యాయమూర్తిని నియమించేటప్పుడు ఇంటెలిజెన్స్ నివేదకలపైనే కాకుండా, సీఎంలు,గవర్నర్ల ఒపీనియన్స్ కూడా తీసుకుం టామని పేర్కొన్నారు.
వివిధ వర్గాలు, ప్రాంతాలకు, వారి సీనియారిటీ, నిబద్ధత, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఇందుకోసం సుప్రీంకోర్టు నిబంధనలు పెట్టిందని వెల్ల డించారు. కొలిజియంకు కొన్ని బాధ్యతలు అప్పగించారని వాటి ప్రకారమే నడుచుకుంటామన్నారు.