calender_icon.png 28 December, 2024 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1200 మంది నియామకాలు రద్దు

01-12-2024 01:24:24 AM

  1. అర్హులతో ఎంపీహెచ్‌ఏ పోస్టులు భర్తీ చేయండి
  2. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీ హెచ్‌ఎ) నోటిఫికేషన్ 2002 వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ నోటిఫికేషన్లో అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వెలువరించాక ప్ర భుత్వం జీవో 1207 ద్వారా 1200 మందిని అడ్డదారిలో నియమించడాన్ని తప్పుపట్టింది.

కోర్టు తీర్పుల తర్వాత కూడా ప్రభుత్వం దొడ్డిదారిన జీవో ఇచ్చి నియామకాలు చేయడాన్ని రద్దు చేసింది. ఒకసారి కోర్టులు తొల గించాలపి ఆదేశాలు జారీచేశాక తిరిగి వారి నే నియమించడం చెల్లదని తేల్చిచెప్పింది. ఒక్కసారి కోర్టులు నిర్ణయం వెలువరించాక అదే అంతిమమని స్పష్టంచేసింది. కోర్టు ఉత్తర్వులతో తొలగించిన వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభు త్వం జారీ చేసిన జీవో 1207 చట్టవిరుద్ధమ ని చెప్పింది.

జీవోను సమర్థిస్తే ప్రభుత్వం చేసిన తప్పునే ఈ కోర్టు మళ్లీ చేసినట్టవుతుందని వ్యాఖ్యానించింది. 90 రోజుల్లో అర్హుల తో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

సుదీర్ఘ న్యాయ పోరాటం

ఎంపీహెచ్‌ఎ నోటిఫికేషన్ 2002లో అర్హతకు సంబంధించిన వివాదం దీర్ఘకాలంగా కోర్టుల్లో నడుస్తోంది. మొదట నోటిఫికేషన్లో అర్హతలను సవాల్ చేస్తూ ట్రైబ్యునల్, తరువాత హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఎస్ ఎస్సీ, డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత గా మెరిట్ జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది.

దీన్ని సుప్రీంకోర్టు సమర్థించడం తో గతంలో అర్హత లేని 1200 మందిని తొ లగిస్తూ ప్రభుత్వం 2012లో జీవో 273 జారీచేసింది. అనంతరం బాధితుల విజ్ఞప్తి మేరకు తొలగించిన 1200 మందిని కాం ట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటూ 2013లో జీవో 1207 జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేయగా ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ జీవోను సమర్థించింది.

ఈ ని యామకాలు కాంట్రాక్ట్ పద్ధతిన జరిగాయని, దీనివల్ల మంజూరైన పోస్టుల్లో రెగ్యులర్ నియామకాలకు ఎలాంటి ఇబ్బందిలేదని పేర్కొంది. 1207 జీవోను సవాలు చేస్తూ, దానితోపాటు వీరికి సమాంతరంగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై మరికొన్ని పిటిషన్లు, వీరి నియామకం వల్ల 2002 నుంచి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై విచారించిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

నిబంధనలకు తిలోదకాలు

హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1200 మందిని అర్హతలు, నిబం ధనలకు అనుగుణంగా పునర్నియామకం చేపట్టలేదని ధర్మాసనం పేర్కొంది. తొమ్మిదేళ్ల సర్వీసు అన్న ఒకే ఒక్క కారణంతో పునర్నియామకం చేపట్టిందని చెప్పింది.