సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, జనవరి 29: హైకోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో రాజకీయ ఒత్తిళ్లు, బంధుప్రీతి ఉండకూడదని సుప్రీం కోర్టు అభిప్రాయ పడిం ది. న్యాయమైన విచారణలు, న్యాయవ్యవస్థ సమగ్రతను నిర్థారించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తారని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుందని తెలిపింది. హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా మెరిట్ ఆధారంగానే చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.