19-02-2025 08:29:58 PM
మునగాల: మండలంలోని గణపవరం, కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం, గ్రామాలలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను, కార్యదర్శులను గ్రామంలో పార్టీ అధ్యక్షులు, పార్టీ బాధ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గణపవరం యూత్ అధ్యక్షుడిగా మేడం దుర్గాప్రసాద్, కార్యదర్శిగా పచ్చిపాల నాగరాజు కొక్కిరేణి యూత్ అధ్యక్షుడిగా పిల్లి నరేష్ కార్యదర్శిగా కామల్ల పవన్ తిమ్మారెడ్డి గూడెం యూత్ అధ్యక్షుడిగా కోచర్ల భారత్ బాబు, కార్యదర్శిగా తిమ్మారెడ్డి మధుసూదన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తక్కెలపాటి సాయి ముఖ్యఅతిథిగా హాజరై సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర యూత్ కమిటీ పిలుపుమేరకు స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ఆదేశానుసారం, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి సూచనల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో యువజన కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ముందల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసే ప్రజలకు తీసుకువెళ్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలను గెలుచుకొని కోదాడ శాసనసభ్యురాలు శ్రీ నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి కానుకగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు అమరబోయిన మట్టయ్య, కాలే సామెల్, కాంగ్రెస్ ఫర్టి సీనియర్ నాయకులు పోటు అశోక్, పిఎసిఎస్ డైరెక్టర్ పచ్చిపాల శ్రీను, బూసిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సూరేపల్లి రమేష్ వజన నాయకులు షేక్ పాషా, మునగలేటి వీరబాబు, పచ్చిపాల నవీన్ పాల్గొన్నారు.