calender_icon.png 21 January, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసులు ఎదుర్కొనేందుకు రెండు న్యాయసంస్థల నియామకం

21-01-2025 12:39:34 AM

న్యాయపోరాటానికి అదానీ గ్రూపు సిద్ధం

ముంబై: దిగ్గజ సంస్థ అదానీ గ్రూపు ఇటీవల అమెరికాలో తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయింది. ఈ మేరకు సెక్యూరి టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్‌క్లాండ్ అండ్ ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ అండ్ సుల్లివాన్ ఎల్‌ఎల్‌పీ అనే రెండు న్యాయసంస్థలను అదానీ గ్రూపు నియమించింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడానికి భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అమెరికాలోని ఎస్‌ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక విచరణ జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కోవడానికి అదానీ గ్రూపు తాజాగా ఈ రెండు సంస్థలను నియమించింది. కంపెనీపై వచ్చిన ఆరోపణలపై ఇవి న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానాలు చెప్పనున్నాయి.