calender_icon.png 21 February, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తుల నియామకం

14-02-2025 01:15:15 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టులో అదన పు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, సుజన కలసికంలను శాశ్వత న్యాయమూర్తులు గా నియమిస్తూ కేం ద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 31న అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురి నీ శాశ్వత న్యాయమూర్తుల నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫా ర్సు చేసిన విషయం విదితమే.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను పరిగ ణలోకి తీసుకున్న కేంద్రం ముగ్గురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గం టలకు మొదటి కోర్టు హాల్‌లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ వీరితో ప్రమాణం చేయించనున్నారు.