calender_icon.png 22 February, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి స్టాండింగ్ కౌన్సిల్‌గా రమణ కుమార్ రెడ్డి నియామకం

21-02-2025 05:13:56 PM

మంథని (విజయక్రాంతి): హైకోర్టులో సింగరేణి అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల పెద్దపల్లి ప్రభుత్వ న్యాయ వ్యవహారాలు, శాసన వ్యవహారాల కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. రమణ కుమార్ రెడ్డి 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో వ్యవహరించనున్నారు.

పెద్దపల్లి జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉండటంతో స్టాండింగ్ కౌన్సిల్‌కు తానను ఎంపిక కావడంతో సింగరేణి సంస్థ, ఉద్యోగులు, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్టు, సర్వీస్ మ్యాటర్స్, ఇతర న్యాయ వ్యవహారాల పరిష్కారానికి కృషి చేస్తానని రమణ కుమార్ రెడ్డి తెలిపారు.  అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ద్వారా రమణ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.