calender_icon.png 29 September, 2024 | 12:50 PM

డబుల్ ఇళ్ల కేటాయింపునకు అధికారుల నియామకం

29-09-2024 12:34:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూంల ను కేటాయించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇన్‌చార్జులుగా అడిషనల్ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ ఆమ్ర పాలి ఉత్తర్వులు జారీచేశారు. వీరు స్థానిక ఆర్డీవోలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్ జిల్లాలో నాంపల్లి మండలానికి ఆర్డీవో శ్రీధర్, అడిషనల్ కమిషనర్ ఎన్ సామ్రాట్ అశోక్, గోల్కొండ, ఆసీఫ్‌నగర్, అంబర్‌పేట, సైదాబాద్, చార్మినార్ బహదూర్‌పురా(పార్ట్) మండలాలకు ఆర్డీవో శివకుమార్, అడిషనల్ కమిషనర్ కేఏ మంగతాయారు, బహదూర్‌పురా (పార్ట్), హిమాయత్‌నగర్ మండలాలకు ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్  సరోజను నియమించారు. రంగారెడ్డి జిల్లాకు ఆర్డీవో విజయలక్ష్మి, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ కే రవికుమార్, మేడ్చల్ జిల్లాకు ఆర్డీవో మాలతీ, అడిషనల్ కమిషనర్ డాక్టర్ యాదగిరిరావును నియమించారు.

నిర్వాసితులకు రుణాల కోసం.. 

నిర్వాసితులు పునరావాసం అ నంతరం అర్హులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూ పు మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద బ్యాంక్ లింకేజ్ రుణాలను ఇప్పించేందుకు అధికారులను నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ జిల్లా లో జియాగూడ, పిల్లిగుడిసెలు, జం గంమెట్, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, జైభవానీనగర్ ప్రాంతాల్లో డబుల్ ఇళ్లు పొందిన మూసీ నిర్వాసితులకు బ్యాంక్ రుణాల ప్రక్రియను ప్రారంభించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.