11-04-2025 01:01:11 AM
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వయిజరీ కమిటీని నియమించింది.
ఈ మేరకు గురువారం జీవో నంబర్ 57ను విడుదల చేసింది. కమిటీ చైర్మన్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ విశ్రాంతి అధికారి డాక్టర్ బీఎం నోద్ కుమార్, వైస్ చైర్మన్‌గా గల్ఫ్ వలసలపై నిపుణుడు మంద భీంరెడ్డి, గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతిరెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, కమిటీ సభ్యులుగా సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, డాక్టర్ లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాసరావు, కొట్టాల సత్యంనారాయణ గౌడ్, గుగ్గిళ్ల రవిగౌడ్, నంగి దేవేందర్‌రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల నియమితులయ్యారు. కమిటీకి రెండేళ్ల కాలప రిమితి ఉంటుంది.