20-03-2025 06:01:16 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లంబాడ హక్కుల పోరాట సమితి మండల కమిటీ నూతనంగా ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ప్రకటించారు. గురువారం ఖానాపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఎంపిక జరిగింది. ఖానాపూర్ మండల అధ్యక్షుడిగా గుగ్లావత్ విలాస్, ప్రధాన కార్యదర్శిగా హపావత్ ప్రభాకర్ లను నియమించినట్లు తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో, జాతి సమస్యలపై పోరాడేందుకు, ఈ కమిటీ పాటుపడాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కిషన్ నాయక్, రాష్ట్ర సీనియర్ నాయకులు భుక్యా గోవింద్ నాయక్, రాజేశ్వర్ నాయక్ తదితరులు ఉన్నారు.