09-03-2025 11:59:50 PM
రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల నియామకం...
హైదరాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్’కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. ఈ మేరకు ఆరుగురు సభ్యులకు కమిటీలో చోటు కల్పిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. కమిటీ సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్, రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, తాహెర్‌బిన్ హుందన్, తెజావత్ బెల్లయ్య నాయక్, గద్దర్ కూతరు వెన్నెలలకు చోటు కల్పించారు.