హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మరో ఐ దు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గాలను నియమి స్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 145 మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించిందింది. సో మవారం నియమించిన వాటిలో ఆదిలాబాద్ జిల్లా ఇందర్‌వల్లి, మం చిర్యాల జిల్లా జన్నారం, సూర్యాపేట జిల్లా కోదాడ, పెద్దపల్లి జిల్లా రామగుండం, కామారెడ్డి, కామారెడ్డి మా ర్కెట్ కమిటీలు ఉన్నాయి. కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ధర్మిగోని లక్ష్మి నియమితులయ్యారు.