18-04-2025 12:59:09 AM
కరీంనగర్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నియమాకం చేస్తూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా తణుకు మహేష్ అసిస్టెంట్, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా కొండ్ర మౌనిక నియమితులయ్యారు.
వీరు ఆర్థిక స్థోమత లేని నిందితులకు ఉచితంగా న్యాయ సహాయము అందిస్తారు. ఈ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజులు అభినందించారు