calender_icon.png 22 December, 2024 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జిగా జీలకర్ర శంకర్ మాదిగ నియామకం

22-12-2024 05:17:56 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ బెల్లంపల్లి మండల ఇన్చార్జిగా జీలకర్ర శంకర్ మాదిగ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని మాదిగ సీనియర్, యువజన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో నూతన కమిటీల ఏర్పాటు కోసం మాదిగలంతా కృషి చేయాలని కోరారు. ఈ నెల 27న బెల్లంపల్లి పట్టణ కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కావున 34 వార్డుల నుండి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మచ్చ రాజేష్, కాంపెల్లి సతీష్, భీమిని మండల ఇంచార్జ్ కాసిపేట కృష్ణ, బొల్లి వంశీ, రామగిరి మహేష్ కుమార్, కేశవ్  తదితరులు పాల్గొన్నారు.