calender_icon.png 1 April, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ పరిరక్షణకు ఇన్చార్జి నియామకం

27-03-2025 12:00:00 AM

ముషీరాబాద్, మార్చి 26: (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ గేటు వద్ద విధులు నిర్వహించడానికి ఒక జిహెచ్‌ఎంసీ కర్మికున్ని ఇంచార్జీగా నియమించినట్లు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తెలిపారు. సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చీకటి పడిన వెంటనే తరచు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో మద్యం సేవించి ప్రశాం తతకు భంగం కలిగిస్తున్నారని, అనధికారిక వెహికల్ పార్కింగ్‌కు నెలవుగా మారిందని అన్నారు.

ఎస్‌ఆర్‌టి జవహర్ నగర్ వ్యాయామశాల, ఆటస్థలం, కళ్యాణ మండపం పరిరక్షణ కమిటీ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ తో సమీక్షించి, సమస్య వివరాలను తెలిపి వారి అనుమతితో ఒక ఇంచార్జీ ను నియమించే నిర్ణయం తీసుకున్నామని తెలి పారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిహెచ్‌ఎంసి ఎస్ ఎస్ గోవర్ధన్, ఎస్ ఎఫ్ ఏ శ్రీనివాస్, వెంకటేష్, సిబ్బంది, కమ్యూనిటీ హాల్ కమిటీ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, మదన్మోహన్, సాయి కుమార్, ఆనంద్ రావు, రాజ్ కుమార్, ప్రశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.