calender_icon.png 17 January, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది ఉత్తర్వులకు లోబడే జిల్లాల్లో జీపీల నియామకం

16-07-2024 12:57:53 AM

స్పష్టంచేసిన హైకోర్టు 

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): జిల్లాల్లోని కోర్టుల్లో ప్రభుత్వ న్యాయవాదుల నియామకం తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని సోమవా రం హైకోర్టు తేల్చిచెప్పింది. గడువు పూర్తికాకుండానే గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లను తొలగిస్తూ ప్రభుత్వం జూన్ 26న జారీచేసిన జీవో 354ను సవాలు చేస్తూ ఎన్ అంజయ్య మరో 20 మంది పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పదవీ కాలం పూర్తికాకుండానే తొలగింపు ఉత్తర్వులు జారీచేశారని అన్నారు. తొలగింపునకు ఓ విధానం అంటూ ఏమీ లేదని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూ ర్తి కొత్త జీపీల నియామకం తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టంచేశారు. విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.