calender_icon.png 25 January, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19 మంది జీపీల నియామకం

13-07-2024 12:36:24 AM

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హైకోర్టులో ప్రభుత్వ కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 19 మందిని ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం న్యాయ శాఖ జీవో (399) జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పేరిట జీవో వెలువడింది. డీవీ చలపతిరావు, ఎం షాలిని, మహమ్మద్ హుస్సే న్, బీ కృష్ణ, ఎస్ సుమన్, ఈ పూర్ణచంద్రరావు, జీ తిరుపతిరెడ్డి, అనంతుల రవీందర్, ఏ అనంతసేన్‌రెడ్డి, ఎం విఘ్నేశ్వర్‌రెడ్డి, టీ వెంకట్‌రాజు, పీ శ్రవణ్‌కుమార్‌గౌడ్, జీ భాస్కర్,  రాజేశ్‌కుమార్, గడ్డం కిరణ్‌కుమార్, ఈ వెంకటరెడ్డి, కే మణిదీపిక, ప్రదీప్‌కుమార్ శ్రీరాంభట్ల, సుజాత కూరపాటిను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఈ పదవుల్లో వారు కొనసాగుతారని లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ పదవుల్లో కొనసాగుతారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.