14-04-2025 12:00:00 AM
- అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
రాజేంద్రనగర్ (కార్వాన్) ఏప్రిల్ 13: చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం చీఫ్ అడ్వైజరీ కమిటీలను నియమించారు. చీఫ్ అడ్వైజర్ గా రాజు వస్తాద్, చీఫ్ లీగల్ అడ్వైజర్ గా రమేష్, ప్రెసిడెంట్ గా సత్యం రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ బాల ప్రసాద్ తివారి, వైస్ ప్రెసిడెంట్ కాంతా నర్సింగ్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతకుముందు జగదాంబికా, మహంకాళి అమ్మవార్లకు అర్చకులు సర్వేష్ చారి, సూరేష్ చారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ చారి శివ చారి తదితరులు పాల్గొన్నారు. వచ్చే బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. భక్తులు స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.