జగిత్యాల అర్బన్, జనవరి 9: బిజెపి జగిత్యాల జిల్లాలోని పలు మండలాలకు అధ్యక్షులను ప్రకటిస్తూ బిజెపి సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ కెవిఎల్‌ఎన్.రెడ్డి గురువా రం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట పార్టీ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టా మని ఆయన వివరించారు.
జగిత్యాల టౌన్ అధ్యక్షులుగా కొక్కు గంగాధర్, జగిత్యాల మండల అధ్యక్షులుగా ఇట్నేని రమేష్, జగి త్యాల అర్బన్ అధ్యక్షులుగా గడ్డం రాంరెడ్డి, రాయికల్ మండల అధ్యక్షులుగా అన్నవేని వేణు, బీర్పూర్ మండల అధ్యక్షుడిగా ఆడెపు నరసయ్య, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షు డిగా బాయి లింగారెడ్డి, మెట్పల్లి రూరల్ అధ్యక్షులుగా కొమ్ముల రాజగోపాల్ రెడ్డి, మెట్పల్లి పట్టణ అధ్యక్షులుగా బొడ్ల రమేష్, మల్లాపూర్ మండల అధ్యక్షుడిగా గోపిడి శ్రీనివాస్ రెడ్డి, కోరుట్ల రూరల్ అధ్యక్షుడిగా పంచరి విజయ్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడిగా బింగి వెంకటేష్, ధర్మపురి పట్టణ అధ్యక్షు డిగా గాజుల భాస్కర్, ఎండపెల్లి మండల అధ్యక్షుడిగా రావు హనుమంతరావు, ధర్మపు రి రూరల్ మండల అధ్యక్షుడిగా కుమ్మరి తిరుపతి, పెగడపల్లి మండల అధ్యక్షుడిగా పల్లె మోహన్ రెడ్డిని నియమించినట్లు ఆయ న తెలిపారు.