calender_icon.png 26 March, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారుల నియామకం

24-03-2025 01:09:57 AM

నిజామాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విగ్నేష్ ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవి లను నియ మించారు. ఈ మేరకు  నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆదివారం రోజు  బార్ అసోసియేషన్ హాల్లో నియామక పత్రాలు అందజేశారు.

శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బార్  కౌన్సిల్  చైర్మన్ నరసింహారెడ్డి బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ ఇతర సభ్యుల సమక్షంలో  హైదరాబాద్ లో అసోసియేషన్ అధ్యక్షుడు తొ జరిగిన సమావేశంలో  నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో  ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

ఎన్నికల అధికారులను నియమిస్తూ జరగబోయే ఎన్నికలను షెడ్యూల్ రీ షెడ్యూల్ చేస్తూ ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల నిర్వహించాలని ఉత్తరులను జారీ చేసినట్లు అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. బార్ కౌన్సిల్‌కు మరియు నిజా మాబాద్ అసోసియేషన్ మధ్య సమాచార లోపంతో హడాక్  కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికలు పూర్తిగా  అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎన్నికల అనంతరం  నూతన కార్యవర్గం వివరాలను రాష్ట్ర బార్ కౌన్సిల్ కు సమర్పించాలని బార్ అసోసియేషన్ ను కోరారరాని జగన్ తెలిపారు.

ఈ మేరకు ఎన్నికల అధికారులు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నియమ నిబంధన  కనుగొనంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్‌లో 2025 2026 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వ హించబడతాయని బార్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. 

న్యాయవా దులు పట్ల గౌరవం ఉన్నదని సభ్యులందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తామని కనుక న్యాయవాదులందరూ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని జగన్ కోరారు. ఈ కార్యక్ర మంలో బార్ అసోసియేషన్ కార్యర్శి వసంతరావు ఉపాధ్యక్షులు ఉన్ని పెండెం రాజు కోశాధికారి ఎ దీపక్, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ సీనియర్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్  శివాజీ భోస్లె రవి  తదితరులు పాల్గొన్నారు