calender_icon.png 27 December, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతు సంరక్షణ మండలి నోడల్ అధికారి నియామకం

12-09-2024 12:25:55 AM

హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): జంతువులపై హింస నిరోధానికిగాను కేంద్ర జంతు సంరక్షణ మండలి నోడల్ అధికారిగా అసి స్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్)ను నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 2021 కేంద్ర జంతు సంరక్షణ మండలి సర్క్యులర్ ప్రకారం చట్టం అమలుకు నోడల్ అధికారిని నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ లఖిల భరత్ క్రిషి గోసేవా సంఘ్‌తోపాటు మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది పీ శ్రీరమ్య వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్)ను జంతు సంక్షేమ మండలి నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నోడల్ అధికారి నియామకం పూర్తయినందున ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని కోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణను మూసివేసింది.