calender_icon.png 19 January, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకం

19-01-2025 01:27:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చారిత్రాత్మకమైన ఆర్ట్స్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రొ. కొండా నాగేశ్వర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ శనివారం నాగేశ్వర్‌రావుకు నియామకపత్రం అందజేశారు. ప్రొ. కొండా నాగేశ్వర్ రావు ప్రస్తుతం వర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌కు నియమితులైన కొండా నాగేశ్వర్‌రావుకు పలువురు తోటి ఉద్యోగులు అభినందలు తెలియజేశారు.