calender_icon.png 3 February, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు ఆఫిడవిట్‌తో పోలీస్ వెరిఫికేషన్ కొరకు దరఖాస్తు

03-02-2025 12:00:00 AM

దర్యాప్తులో తేలిన కేసులు, వ్యక్తి పై చట్టరీత్యా చర్య

గోదావరిఖని, ఫిబ్రవరి 2:  గోదావరిఖని లెనిన్ నగర్ కు చెందిన  వనపాకల విజయ్ అనే వ్యక్తి తనపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు అఫిడవిట్ చూపించి, పోలీస్ వెరిఫికేషన్ కొరకై దరఖాస్తు చేసుకోగా, పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఉన్నతాధికారులు తనపై దర్యాప్తు చేసి 5 క్రిమిన ల్ కేసులు ఉన్నాయని వివరాలు వెల్ల డించి,

అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేయవలసిందిగా గోదావరిఖని వన్ టౌన్ పోలీసు వారిని సూచించారు. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడం జరిగింది. తప్పుడు ధ్రువ పత్రాలు చూపి సర్టిఫికెట్లు పొం దాలి అనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకో వడం జరుగు తుందని 1-టౌన్  పోలీసులు హెచ్చరించారు.