calender_icon.png 2 February, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ డి పోస్టులకు ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోండి

01-02-2025 10:53:06 PM

ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం వారి ఆధ్వర్యంలో గల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రూప్-D(32,000) పోస్టులకు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ ఫీజు కేవలం రూ.250/-మాత్రమే చెల్లించాలని, విద్యార్హతలు పదవ తరగతి/ఐటిఐ, పోస్టుల వివరాలు, వేతనం, వయోపరిమితి వివరాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ నందు సంప్రదించాలని ఆయన కోరుతూ, మిగతా వివరాలకు 7729961197 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని ఆయన కోరారు.