* ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ కోటాజీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ హైద జిల్లా డీడీ కోటాజీ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో విదార్థుల ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాల కోసం గతేడాది 23,941 దరఖాస్తులు రాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17,8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు.