calender_icon.png 18 April, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువు సమీపిస్తుంది..

11-04-2025 06:38:56 PM

రాజీవ్ యువ వికాస్ కి దరఖాస్తు చేసుకోండి..

మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి..

బూర్గంపాడు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వారి ఆర్థిక అభ్యున్నతి కోసం అందిస్తున్న ఆర్థిక చేయూత పథకం రాజీవ్ యువ వికాస్ కు గడువు సమీపిస్తుందని నిరుద్యోగులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోగలరని మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి అన్నారు. ఇంకా మిగిలిన దరఖాస్తులను స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రజాపాలన కేంద్రం నందు ఈనెల 14వ తేదీ వరకు స్వీకరించబడునున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఉద్యోగం లేక ఆర్థికంగా ఎనకబాడుతనంతో కుటుంబ జీవనం సాగించడం కష్టమని భావించిన ప్రజా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ అందించే దిశగా నిరుద్యోగ యువకుల కోసం ఈ పథకాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దరఖాస్తు ఫారంను స్వయంగా పూర్తి చేసి ఆన్లైన్ చేసిన తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో నేరుగా లబ్ధిదారుడే వచ్చి అందించాలని కోరారు. అభ్యర్థుల ఎంపిక విషయం గురించి మాట్లాడుతూ... ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు అందలేదన్నారు. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని త్వరలోనే ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుసరించి వివరిస్తామని తెలిపారు. మొత్తం మండలంలో ఏఏ వర్గాల వారు ఎంతవరకు దరఖాస్తులు చేసుకున్నారు, క్యాటగిరి వైడ్ గా విభజన చేస్తామని తుది గడువు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎంపికే ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందని అంచనాలు మాత్రం ఇప్పటివరకు అందలేదు అన్నారు.

ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా రుణాలు మంజూరు చేయిస్తామని దరఖాస్తుదారుల నుండి డబ్బులు అడిగినట్లయితే అట్టి వారి వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని ఎటువంటి రూపాయి కూడా అలాంటి వారి మాటలు నమ్మి ఇవ్వవద్దని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు మండలంలో దరఖాస్తుదారులను కాకా పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు వరంగా రాజీవ్ యువ వికాసం పథకం ఉండాలనే లక్ష్యంతో అర్హత కలిగిన వారికే పథకం అందాలని ఎలాంటి లంచాలకు తావివ్వకుండా లబ్ధిదారి ఎంపిక ఉంటుందన్నారు.