నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రోత్సవ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సంస్థల పతన కలెక్టర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి ఫైజాన్ అహ్మద్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల సర్టిఫికెట్లో 40 శాతం దివ్యాంగత్వం ఉన్నవారు ఈ నెల 21 వరకు ప్రోత్సవ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దివ్యాంగులకు 50 వేల నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని జిల్లాకు 84 యూనిట్లు మంజూరైనట్టు ఆయన తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ ను స్వీకరించడం జరుగుతుందన్నారు.