26-02-2025 05:49:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ ద్వారా నిర్వహించబడుతున్న బస్సులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి అర్హులైన డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ డిఎం ప్రతిమారెడ్డి తెలిపారు. హెవీ లైసెన్స్ ఉండి బ్యాచ్ నెంబర్ ఉన్నవారికి దరఖాస్తు చేసుకుంటే కరీంనగర్లో 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం డిపోలో డ్రైవర్గా విధుల్లో చేర్చుకుంటామని వారికి ప్రతినెల రూపాయలు 24 వేల వేతనం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని కోరారు. శిక్షణ కాలంలో రోజుకు 200 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్రైవర్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 9492767679, 72828 42185 నంబర్లను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.