calender_icon.png 16 January, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి

01-12-2024 07:26:10 PM

మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 2024 విద్య సంవత్సరం పాల్ సీజన్ కు విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థుల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సీఎం ఓవర్సీస్ పథకానికి అర్హులైన విధ్యార్దులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపు కలిగి, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్  దేశాలలో పీజీ, పీహెచ్.డి లలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హులని పేర్కొన్నారు.

అర్హత కలిగిన విద్యార్థులు డిసెంబర్ 31వ తేదీ లోపు సంబంధిత ధృవీకరణ పత్రాలతో www.telanganaepass.cgg.gov.in  అనే వెబ్ సైట్ నందు ఆన్లైన్ చేసిన హార్డ్ కాపీ, సంబంధిత పత్రాలను జిల్లా కలెక్టరేట్ లలోని మైనారిటీ సంక్షేమ కార్యాలయాలలో సమర్పించాలని తెలిపారు. ఈ ఉపకార వేతనాలకు ఎంపికైన వారికి 20 లక్షల రూపాయలతో పాటు విమాన చార్జీల నిమిత్తం 60 వేల రూపాయలు కూడా అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకై 8520860785 నంబర్ కు సంప్రదించాలని అన్నారు.