20-04-2025 06:47:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీఎస్ఆర్ జెసి గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ సోఫినార్ గురుకుల పాఠశాల(Gurukul School) ప్రిన్సిపల్ డేనియల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంపీసీ బైపిసి ఎంఈసి కోర్సులు ప్రవేశాల కోసం ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రతి కోర్సులు 40 సీట్లు ఉంటాయని ప్రభుత్వ రిజర్వేషన్ కేటగిరీలో ఇంటర్ ప్రవేశాలు కల్పించి నాణ్యమైన విద్య మంచి భోజనం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా గురుకుల పాఠశాలలో నిర్వహించబడతాయని ఆయన తెలిపారు.