నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం హరులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ బాలుర ప్రిన్సిపల్ సౌకత్ హుస్సేన్ తెలిపారు. మైనార్టీలకు 30 ఇతరులకు 10 సీట్లు రిజర్వేషన్ కోటాలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 18 నుంచి వచ్చే నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ప్రజల కోసం 7207998970, 944075 3493 నంబర్లను సంప్రదించాలని సూచించారు.