calender_icon.png 24 April, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిట్ స్కాలర్షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోండి

24-04-2025 12:11:05 AM

ఇల్లెందు, ఏప్రిల్ 23 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా జి.ఎం. కార్యాల యంలో బుధవారం  ఏర్పాటుచేసిన సమావేశంలో ఏరియా జి.యం. వి.కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో పనిచేస్తున్న అధికారులు  మరియు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 2024-25  విద్యా సంవత్సరానికి గాను మెరిట్ స్కాలర్షిప్ కొరకు  ధరఖాస్తు చేసుకోవాలని తెలి పారు.ఉద్యోగుల పిల్లలు NEET/ EAMC ET&NIT(JEE- Mains)/AIIMS/BITSAT ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, సంబంధిత విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందిన వారికి సింగరేణి సంస్థచే ప్రతి విద్యా సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ పొందుట కొరకై ఉద్యోగులు సంబంధిత గని/ విభాగాలలో దరఖాస్తు తో పాటు ర్యాంక్ కార్డు, అలాట్మెం ట్ ఆర్డర్, అడ్మిషన్ కార్డు, ఫీజు చెల్లించిన రశీదు జతపరిచి అందజేయగలరని తెలిపారు.  EAMCET/NEET లో ర్యాంక్ 2000 టు 8000 లోపు ఉన్న వారే అర్హులన్నారు.