02-03-2025 06:21:02 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉపాధ్యాయ విద్యార్థి కోర్సు అందుబాటులోకి వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ మహాత్మ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు 4-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బిఎ. బిఎడ్ లో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 విధ్యా సంవత్సరం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ కోర్సు లక్షెట్టిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో అందుబాటులో కలదన్నారు. అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరి 20వ తేది నుండి మార్చ్ 16వ తేది లోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించి యోగి ఉంచుకోవాలని కోర్సు సమన్వయ కర్త డా. సంతోష్ కుమార్ తెలియచేశారు. మరింత సమాచారం కోసం ఎన్టీఏ వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.