11-04-2025 01:16:33 AM
మునగాల ఏప్రిల్ 10:- సూర్యాపేట జిల్లా మునగాల రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో తప్పక అందజేయాలి అని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ఆన్నారు. గురువారం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న వివరాలతో పాటు జిరాక్స్ కాపీలను ఆధార్ కార్డు ఆదాయ ధ్రువీకరణ లేదా రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం ఫోటో వికలాంగులైనట్లయితే సదరం సర్టిఫికెట్ వ్యవసాయ ఆధార లోను కైతే భూమి పట్టాదారు పాస్ పుస్తకం విద్యా అర్హతలు సర్టిఫికెట్లు జతచేసి ఇవ్వాలని తెలియజేశారు.
ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తులు ఇవ్వనివారు వెంటనే కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు ఇప్పటివరకు 1727 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు 529 మాత్రమే సమర్పించారు ఇంకా దరఖాస్తులు ఆఫీసులో సబ్మిట్ చేయని వారు వెంటనే అందజేయగలరు.
ఈనెల 14 వరకు చివరి రోజు కావున లబ్ధిదారులు గడువు తేదీలోగా ఆన్లైన్ చేసుకోవాలని బి శిరీష మండల ప్రత్యేక అధికారి ఉపముఖ్య కార్య నిర్వహణ అధికారి జిల్లా ప్రజా పరిషత్ మరియు ఎంపీడీఓ కె. రమేష్ దీన్ దయాల్ ఒక సంయుక్త ప్రకటన లో తెలిపినారు.