calender_icon.png 1 January, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

03-12-2024 03:39:41 AM

కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ నేరుగా ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 43 ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. అదనపు కలెక్టర్ మాధూరి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్‌వో పద్మజ రాణి తదితరులు ఉన్నారు.