calender_icon.png 5 January, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫౌండేషన్ శిక్షణ కొరకు దరఖాస్తులు చేసుకోవాలి

02-01-2025 11:02:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే ఫౌండేషన్ శిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. గ్రూపు 1 2 3 4 పరీక్షలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు 4 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. అరులైన అభ్యర్థులు ఈనెల 10 లోపు అన్ని ధ్రువీకరణ పత్రలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.