* జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
* ప్రజావాణిలో 142 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్ల, డిసెంబర్ 23 (విజయక్రాంతి):ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పు డు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరి యంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే దరఖా స్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఆయా శాఖ లకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్జీదా రులకు పరిష్కార మార్గం చూపాలన్నారు.
రెవెన్యూ శాఖకు 58, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి20, ఎస్ డీ సీకి 10, ఎస్పీకి 7, విద్యా శాఖ, జిల్లా పంచాయతీ అధికారి కి 4 చొప్పున, ఎల్‌డీఎం, వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి, ఉపాధి కల్పన శాఖకు 3 చొప్పున, డీసీఎస్‌ఓ, జిల్లా సంక్షేమ అధికారి, ఎంపీడీవో కోనరావుపేట, ఎల్లా రెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లికి రెండు చొప్పున, ఎంపీడీవో ఇల్లంతకుంట, ముస్తా బాద్, గంభిరావుపేట చందుర్తి, ఇరిగేషన్, జిల్లా వైద్యాధికారి, వ్యవసాయ అధికారి, డీఎండబ్ల్యూఓ, సెస్, డీటీడబ్ల్యూఓ, హ్యాండ్ లూం అండ్ టెక్సుటైల్స్, డీపీఆర్‌ఈ, డీఎస్ సీడీ ఓ, ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ సిరిసిల్ల, డీబీసీ డీఓ ఒకటి చొప్పున 142 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇక్కడ ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.