19-04-2025 04:50:23 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
ప్రజాపాలన సేవా కేంద్రం సందర్శన..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని ఆర్డిఓ లోకేశ్వర్ రావుతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుండి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ పథకం కింద 50 వేల నుండి నాలుగు లక్షల వరకు పలు యూనిట్ల కింద దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని అర్హులైన యువతి, యువకులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ జ్యోషి, తదితరులు పాల్గొన్నారు.